గోదావరిలో నీళ్ళు లేకపోతే పట్టిసీమకి ఎలా వచ్చాయి?

July 11, 2026


img

మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు మీడియాతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ఓ సూటి ప్రశ్న అడిగారు. “ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద గోదావరిలో సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు పారుతోంది. కానీ అక్కడ నీళ్ళు లేవన్నారు.

మీరు చెప్పినట్లే అక్కడ ఎత్తిపోసుకోవడానికి ఒక్క చుక్క నీరు లేదనుకుందాం. మరయితే దిగువన ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ప్రాజెక్టులో వాళ్ళు నీళ్ళు ఎలా ఎత్తిపోసుకున్తున్నారు. గోదావరి నీళ్ళు తెలంగాణలో పారకుండా ఏపీకి ఎలా చేరుకున్నాయి?

గోదావరి వరద నీటిని ఎత్తిపోసుకునేందుకే ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించుకుంది. ఇప్పుడది దాంతో నీటిని ఎత్తిపోసుకుంటోంది అంటే అర్థం ఏమిటి? గోదావరిలో లక్ష క్యూసెక్కుల నీళ్ళు పారుతున్నా కన్నెపల్లి పంప్ హౌసులో మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు? 

అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మరమత్తు పనులు పూర్తయ్యాయని మీ ఇంజనీర్లే చెపుతున్నారు కదా? ఆ రెండు బ్యారేజీలు వాడకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిలోకి నీళ్ళు ఎందుకు ఎత్తిపోసి నిలవచెయ్యట్లేదు?అంటూ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. 

కేసీఆర్‌ మీద కక్షతో ప్రాజెక్టులు ఎండబెట్టి తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్‌ విమర్శించారు. 


Related Post