ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో జగపతి బాబు, లయ, హ్రితిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన ‘వదల’ ట్రైలర్ విడుదలైంది. భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవితం గడుపుతున్న జగపతి బాబు వెంటపడుతుంది ఓ యువతి. ఆమె ప్రేతాత్మా లేక పగబట్టిన యువతా? అనే సస్పెన్స్ ట్రైలర్‌లో కొనసాగించారు.
ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, రవివర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: ఆకెళ్ళ వి. కృష్ణ; కథ: లక్ష్మీ భూపాల; సంగీతం: కార్తీక్ బి. కొడకండ్ల; కెమెరా: చోటా కే నాయుడు; స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్; పాటలు: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణ చారి ఎర్రోజు, వీరు గడ్డం ప్రసాద్ కుమార్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు చేశారు.
చరిత చిత్ర బ్యానర్‌పై కిశోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది.