బీఆర్ఎస్‌ ఖాతాలో ఆ 1,400 కోట్లు.. అవినీతి సొమ్మే

July 09, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గత కొంత కాలంగా బీఆర్ఎస్‌ పార్టీ జోలికి పోకుండా తన పార్టీని బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టారు. కానీ ‘టీఆర్ఎస్‌’ పేరు విషయంలో బీఆర్ఎస్‌ పార్టీ ఈసీకి పిర్యాదులు చేస్తూ అడ్డుపడుతుండటంతో ఆమె మళ్ళీ భగ్గుమన్నారు. 

నేడు కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ, నా పార్టీ ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరమూ, భయం లేదని చెప్పిన బీఆర్ఎస్ అధిష్టానం, ఇప్పుడు ఫిర్యాదులు చేయడం వారి భయానికి నిదర్శనం కాదా? నేను ప్రజల సమస్యలపై పోరాడుతుంటే వచ్చి మీరూ పోరాడండి. కానీ అవినీతి కబుర్లతో కాలక్షేపం చేస్తూ మద్యలో నన్నెందుకు అడ్డుకుంటున్నారు? 

నేను బీఆర్ఎస్ నేతల జోలికి వెళ్ళకపోయినా వారు అడుగడుగునా నాకు అడ్డుతగులుతూనే ఉన్నారు. మీడియాలో నాకు సంబంధించిన వార్తలు ప్రసారం చేయొద్దంటూ గుంటనక్క (హరీష్ రావు) మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారు. జాతీయ మీడియాపై కూడా నాకు వ్యతిరేకంగా ఒత్తిడి చేస్తున్నారు.

నేను, నా పార్టీ అంటే భయం లేదని చెపుతూనే నన్ను అడ్డుకునేందుకు ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీలతో చేతులు కలుపుతున్నారు. .

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి భాగోతాన్ని కవిత బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రో కో పద్ధతిలో ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి సమకూరినవేనని ఆరోపించారు. ఆ డబ్బును ముందుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంపిణీ చేసి, ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి నన్ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. 

గతంలో ఎన్నికలలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధులకు పార్టీ తరపున భారీగా నగదు అందిస్తూ బీఆర్ఎస్‌ పార్టీ ఖాతాలో వెయ్యి కోట్లు పైగా నిదులున్నాయని, మన పార్టీ చాలా ధనవంతమైనదని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు.

ఆ సొమ్ము ఏవిధంగా సమకూర్చుకున్నారో ఇప్పుడు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు. ఆమె చేసిన ఈ ఆరోపణపై బీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం స్పందిస్తుందా లేక ఎప్పటిలాగే మౌనం వహిస్తుందా?


Related Post