వసుదేవసుతం... రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

July 09, 2026


img

మహేంద్రన్, అంబికావాణి జంటగా చేసిన ‘వసుదేవసుతం’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్నందున రిలీజ్‌ ట్రైలర్‌ అంటూ మరొకటి విడుదల చేశారు. ఇది కూడా అద్భుతంగా ఉంది. 

ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో మహిమాన్వితమైన ‘బ్రహ్మ పదార్ధం’ దొంగిలించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటే వాటిని హీరో ఏవిధంగా అడ్డుకునాడనేది ఈ సినిమా కథ. ట్రైలర్‌లో గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ వగైరా అద్భుతంగా ఉన్నాయి.  సోషియో ఫ్యాంటసీ మూవీ అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించక తప్పదు.  కనుక హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సీన్స్, హీరో యాక్షన్ సీన్స్ వగైరా కూడా బాగానే కలిపినట్లు ట్రైలర్‌తో స్పష్టమైంది.     

వైకుంట్ బోను దర్శకత్వంలో ఈ సినిమాలో జాన్ విజయ్‌, మీమ్‌ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, ఉలాసి, రాజీవ్ కనకాల, తర్జన్, రామరాజు, భద్రం, జబర్దస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేతా బజాజ్ తదితరులు నటించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వైకుంఠ్ బోను, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీహర్ష ఎమాని, సంగీతం: మణిశర్మ, కెమెరా: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), స్టంట్స్: రామకృష్ణ చేశారు. 

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పైపై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన వాసుదేవసుతం జూలై 10న థియేటర్లలో విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/9HOr-pcjZ-M?si=ktU9152FLDSDvlRo" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష