గోదావరిఖని (సింగరేణి) బొగ్గుగని కార్మికుల జీవితాలను ప్రతిభింబించే చక్కటి కథతో ఓ సినిమా సిద్దమవుతోంది. దీని పేరు ‘కొత్త సినిమా.’
దర్శకుడు అజార్ తెరకెక్కి స్తున్న ఈ సినిమాలో ఏకంగా వంద మందికి పైగా సరికొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. వారందరికీ ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇచ్చి మరీ ఈ సినిమాలో నటింపజేఇస్తున్నారు.
గోదావరిఖని పరిసర ప్రాంతాల లైవ్ లొకేషన్లలోనే షూటింగ్ జరుపుతున్నారు. బొగ్గు గని కార్మికుల జీవితాలకు అద్దం పడుతూ వ్రాసుకున్న కథని కొత్త సినిమా పేరుతో తెరకెక్కిస్తున్నారు.
మహ్మద్ వసీం అక్రం నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. కానీ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.