అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న సినిమా నుంచి అప్పుడే కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు అయన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.
ఇంట్లో జరుగుతున్న ఓ శుభాకర్యంలో కల్యాణ్ రామ్ పట్టుబట్టలు కట్టుకొని మెళ్ళో పూలదండవేసుకొని గ్రూప్ డాన్స్ చేస్తున్న పోస్టర్ బాగుంది. “నా మొదటి హీరో, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరైన నందమూరి కల్యాణ్ రామ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక డెబ్యూ డైరెక్టర్‌గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞడనై ఉంటాను. #VenkyAnil5 #NKRAR2 సినిమాలో మిమ్మల్ని సరికొత్త అవతార్‌లో చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, సర్. ఈ సంక్రాంతి 2027ని ఇంకా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం,” అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు ‘శ్రీమన్’ని కూడా తీసుకున్నట్లు అనిల్ రావిపూడి నేడే ప్రకటించారు. రు.
ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కనుక దీనికి ‘జనవరి 13’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.