మ్యాడ్, ఆయ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యువ హీరో నార్నే నితిన్ తన 5వ సినిమాకి సిద్దమైపోయారు. హైదరాబాద్‌లో అదివారం ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
నిర్మాత వెంకట్ కే నారాయణ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 'మ్యాడ్' ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశారు.
ఈ సినిమాలో ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అనికా సురేంద్రన్ ఒక హీరోయిన్‌గా నటించబోతున్నారు. కన్నడ బ్యూటీ మేఘా శెట్టి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అడుగుపెడుతుండటం విశేషం.
ఈ సినిమాకు సంగీతం: వివేక్-మెర్విన్, సినిమాటోగ్రఫీ: రామ మారుతి ఎం, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, ఆర్ట్ డైరెక్టర్: శివ కమేష్ డి చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటుల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.