యువ నటుడు హర్ష్ రోషన్ చూస్తుండగానే ఆరు సినిమాలు చేసి ఏడవ సినిమాకి సిద్దమవుతున్నాడు. అరుణ్ బాలాజీ, శ్రీ రంజనిల దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో హర్ష్ రోషన్‌కి జోడీగా ప్రియాంక ఆచార్ నటిస్తోంది.
ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్, ఎన్.వి. కృష్ణారెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు。
త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయినందున త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.