జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం.’
తిరుపతి పట్టణంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథ నేపధ్యంతో వస్తున్న కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్ ముఖ్య పాత్రలు చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల చేయబోతున్న చిత్ర బృందం ప్రకటించింది.