వీసా నుంచి చింగారి సాంగ్‌ ప్రమో

July 03, 2026


img

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘వీసా.. వింటారా సరదాగా’ నుంచి చింగారి సాంగ్‌ ప్రమో నేడు విడుదలైంది. సనారే వ్రాసిన ఈ పాటకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరాం పాడారు. పూర్తి పాత ఈరోజు సాయంత్రం 4.06 గంటలకు విడుదల కాబోతోంది.  

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ యువత కలల చుట్టూ అల్లుకున్నదే ఈ కథ. ఈ సినిమాతో ఉద్భవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

ఈ యూత్ ఫుల్ కామెడీ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష