తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జూనియర్ కాలేజీ విద్యార్ధులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పధకాన్ని వర్తింపజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు, భోధనేతర సిబ్బందికి కూడా ఈ పధకాన్ని విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నేడు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
కనుక ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతీరోజూ పొద్దున్న లేవగానే టిఫిన్లు, క్యారేజీలు అంటూ హడావుడి పడకుండా నిశ్చింతగా స్కూల్, కాలేజీలకు బయలుదేరిపోవచ్చు. ఉపాధ్యాయులకు కూడా ఈ పధకం వర్తింపజేయడం ద్వారా అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.