తమిళ వెబ్‌ సిరీస్‌కి జాన్వీ కపూర్‌ గ్రీన్ సిగ్నల్‌?

July 02, 2026


img

పెద్ది సినిమాతో జాన్వీ కపూర్‌ ఆకాశమంత ఎత్తుకు దూసుకుపోతుందని అనుకుంటే, ఆ సినిమాకి ఆమె వలెనే నష్టం జరిగిందనే చెడ్డ పేరు మూటగట్టుకుంది. అయితే అందుకు ఆమెను తప్పు పట్టలేము. దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్దికి కమర్షియల్ హంగులు కూడా జోడించాలనే ఉద్దేశ్యంతో ఆమె చేత అందాల ప్రదర్శన చేయించారని అందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ జాన్వీ కపూర్‌ ఈ విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగిపోతోంది. పెద్ది తర్వాత ఏమిటి? అనే ప్రశ్నకు కోలీవుడ్‌ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పా.రంజిత్ చెప్పిన కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాక హిందీలో ముందే ఒప్పుకున్న రెండు సినిమాలు చేసేందుకు జాన్వీ కపూర్‌ సిద్ధం అవుతోంది.         



Related Post

సినిమా స‌మీక్ష