వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ‘రావు బహదూర్’గా నటించిన సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ నటుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో రావు బహదూర్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లోనే సత్యదేవ్ నట విశ్వరూపం చూపించారు. మరి సినిమా ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే జూలై 3న థియేటర్లలో విడుదలైనప్పుడు చూడాల్సిందే.
ఈ సినిమాలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. రావు బహదూర్ వేషంలో సత్యదేవ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టమే. మేకప్ అంత అద్భుతంగా ఉంది. వికాస్ ముప్పల, దీప థామస్, బాలీవుడ్ పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినినిమాకు కథ, దర్శకత్వం, ఎడిటింగ్: వెంకటేష్ మహా, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్, కోరియోగ్రఫీ: శ్రావణ్ ముప్పిరి చేశారు.
ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్న ‘రావు బహదూర్’ జూలై 3న విడుదల కాబోతోంది.