టీఆర్ఎస్‌ కల్వకుంట్ల కవిత చేజారిపోతుందా?

July 01, 2026


img

టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాలలో లబ్ది పొందవచ్చనుకున్న కల్వకుంట్ల కవితకు ఇప్పుడు ఆ పేరే సమస్యగా మారేలా ఉంది. టీఆర్ఎస్‌ పార్టీ పేరుపై ఎన్నికల సంఘానికి 700కు పైగా లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు అందాయి. వాటిలో అత్యధికంగా బహుశః బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల నుంచే వచ్చి ఉండవచ్చు. 

వాటికి ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే గతంలో ఆమె ఇచ్చిన మిగిలిన నాలుగు పేర్లలో ఏదో ఒకటి లేదా ఈసీ సూచించబోయే కొత్త పేరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 

ఒకవేళ ఇదే జరిగితే టీఆర్ఎస్‌ పేరుతో ప్రజలలోకి వెళ్ళిన కల్వకుంట్ల కవితకు పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు.

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నాలను పోలిన వాటిపైనే ఆ పార్టీ ప్రతీసారి అభ్యంతరాలు చెపుతున్నప్పుడు తమ పార్టీ పాత పేరును మరో పార్టీ ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుందనుకోలేము. ఒకవేళ ఈసీ అనుమతిస్తే ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందనే బీఆర్ఎస్ వాదన సహేతుకంగానే కనిపిస్తోంది. 

ఒకవేళ ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరును తిరస్కరిస్తే అది కవితకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అదే సమయంలో, కవిత పార్టీ పేరును మార్చించడంలో బీఆర్ఎస్ సఫలమైతే, ఇంతకాలం ఆమె చేసిన విమర్శలు, ఆరోపణలకు ఈవిధంగా ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. కనుక కల్వకుంట్ల కవిత తన టీఆర్ఎస్‌ పార్టీ పేరు కాపాడుకోగలరో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 


Related Post