మేము ఎన్నో తప్పులు చేశాం: కేటీఆర్‌

June 27, 2026


img

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అవును మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కాదు అనేక తప్పులు చేశాం. మేము దైవాంశ సంభూతులమని, కనుక తప్పులు చేయలేదని చెప్పడం లేదు. ఉదాహరణకు గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు వెంటనే టిపీఎస్సీసీని రద్దు చేసి ఉండాల్సింది. కానీ ఆ దరిద్రాన్ని మా నెత్తిపై పెట్టుకొని మోసి అప్రదిష్టపాలయ్యాము.

మా హయంలో ఇలాంటి తప్పులు చాలానే జరిగాయి. మేము మానవమాత్రులమే కనుక తప్పులు చేయడం సహజమే.

అయితే మా ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడంలో మేము అలసత్వం ప్రదర్శించడం వలన కూడా మేము నష్టపోయాము. ఉదాహరణకు తెలంగాణ ఏర్పడక మునుపు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ మా ప్రభుత్వం అధికారంలోకోకి వచ్చిన తర్వాత 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాము. వాటితో రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాము. కొత్తగా ఆ మేరకు మెడికల్ సీట్లు పెంచగలిగాము.

ఇలాంటి ఎన్నో మంచి పనులు చేశాము. కానీ వాటి గురించి ప్రజలకు చెప్పుకోవడంలో అలసత్వం ప్రదర్శించడం వలన నష్టపోయాము,” అని కేటీఆర్‌ అన్నారు.


Related Post