తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు?

June 24, 2026


img

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన మార్యదర్శి కే. రామకృష్ణా రావు గత ఏడాది ఏప్రిల్‌ నెలలో బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఆగస్ట్ నెలలోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా మొదట 7 నెలలు, మళ్ళీ మరో మూడు నెలలు  పొడిగించింది. ఆ ప్రకారం ఈ నెల 30 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అయన స్థానంలో కొత్త సీఎస్ నియమాకానికి కసరత్తు పూర్తి చేసింది. 

తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజుని ఆ పదవిలో నియమించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖలో పనిచేస్తున్నారు. ఆయన సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం కనుక ఆయనని తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాయగా సానుకూలంగా స్పందించింది. కనుక సంజయ్ జాజుని సీఎస్‌గా నియమించేందుకు రప్పిస్తున్నట్లు సమాచారం. 

ఈ నెలాఖరుకి ఎలాగూ రామకృష్ణా రావు పదవీ విరమణ చేయబోతున్నారు కనుక ఆలోగానే సంజయ్ జాజు నియామకం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post