అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ముంబయిలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున హాజరు కాలేకపోయారు.
2024, డిసెంబర్ 4న హైదరాబాద్, సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి నేటికీ చికిత్స పొందుతున్నాడు. చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్ పేరు ఏ-11గా చేర్చారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ స్వయంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
కానీ షూటింగ్ కారణంగా హాజరుకాలేకపోతున్నారని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన న్యాయవాదులు నాంపల్లి కోర్టుని అభ్యర్ధించారు. దీనిపై న్యాయస్థానం స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.