తెలంగాణ మల్టీ జోన్-2 సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల కార్యాలయంలో ఉప సంచాలకుడుగా పనిచేస్తున్న నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు కోట్ల రూపాయల నగదు, సుమారు వంద కోట్లుపైగా విలువైన స్థిరాస్తి పత్రాలు, భారీగా వెండి, బంగారు ఆభరణాలు, బంగారం బిస్కట్లు పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఆయనకు బ్యాంక్ లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని కూడా తెరిచి చూడాలనుకున్నారు. కానీ నరహరి లాకర్ తాళం చెవి ఇచ్చేందుకు నిరాకరించారు. కనుక ఏసీబీ అధికారులు కోర్టు అనుమతి తీసుకొని, బ్యాంక్ లాకర్ బద్దలు కొట్టి తెరిచారు. దానిలో వారు కోటిన్నర నగదుతో పాటు ఏకంగా రెండున్నర కేజీల బంగారం చూసి షాక్ అయ్యారు. ఆ డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.