మణికొండలో రేపే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం!

June 18, 2026

img

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరిస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే శుక్రవారం హైదరాబాద్‌ నగరంలోని మల్కంచెరువు సమీపంలో మణికొండ వద్ద జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. రేపు ఉదయం 11.08 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనాల్సిందిగా జనసేన పార్టీ ఆహ్వానించింది.

జనసేన పార్టీ ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తోంది. శాసనసభ, మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసింది కూడా. కానీ ఇంతవరకు పార్టీకి ప్రత్యేకంగా కార్యాలయం లేకపోవడంతో హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్‌ నివాసంలో లేదా కన్వెన్షన్/ఫంక్షన్ హాల్స్ లో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.

తెలంగాణలో ‘జనసేన’ అవసరం లేదని వాదించిన అధికార ప్రతిపక్షాలు ఇప్పుడీ కార్యక్రమంపై ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.

రేపు (జూన్ 19న) హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నూతన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం!

ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

తేదీ: జూన్ 19,… pic.twitter.com/tFT4nXp8Pd
— JanaSena Telangana (@JSPTelangana) June 18, 2026

Related Post