సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ సీజన్‌కి ఉన్న డిమాండ్ తెలిసిందే. కాస్త యావరేజ్‌గా ఉన్న సినిమాలు సైతం ఈ సీజన్‌లో విడుదల చేసుకోగలిగితే ఒడ్డున పడతాయి. కనుక ప్రతీ సంక్రాంతికి చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయి.
సంక్రాంతి సీజన్ బాగా అచ్చొచ్చిన హీరోలాలో శర్వానంద్ కూడా ఒకరు. 2017 సంక్రాంతికి విడుదలైన ‘శతమానం భవతి’ అతని కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ పడలేదు. కనుక మళ్ళీ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు.
మాస్ ఎంటర్‌టైన్మెంట్ చేయడంలో చెయ్యి తిరిగిన శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి సుంకర నిర్మించబోతున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.