జూన్ 19న బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల పోటీ

June 17, 2026


img

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ హడావిడి ముగిసిపోయింది. దాని తర్వాత మరో పెద్ద సినిమా ఏదీ రిలీజ్‌ కాలేదు. కనుక ఈ వీకెండ్ చిన్న సినిమాలకు తగినంత స్పేస్ దొరికింది. 

ఈ నెల 19న సమంత ప్రధానపాత్రలో ‘మా ఇంటి బంగారం’,  వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, ఇంకా ‘దిష్టిబొమ్మ’, ‘పాతాళ గుహ,’ ‘దీవానా’ సినిమాలు విడుదలకాబోతున్నాయి. 

సూపర్ హిట్ మూవీ ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి-సమంత కలిసి చేస్తున్న ‘మా ఇంటి బంగారం’పై అంచనాలున్నాయి. పెద్ద సినిమాల నుంచి పోటీ కూడా లేదు. కనుక సరైన కంటెంట్‌తో వస్తే హిట్ కొట్టడం తేలిక. 



Related Post

సినిమా స‌మీక్ష