ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు: గిర్ర గిర్రా లిరికల్ వీడియో సాంగ్‌

June 07, 2026


img

ఒకప్పుడు టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి మెప్పించిన యువ నటుడు వడ్డే నవీన్ అనివార్య కారణాల వలన సినీ పరిశ్రమకి దూరం అయిపోయాడు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

ఈ సినిమా నుంచి గిర్ర గిర్రా లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. భాస్కర భట్ల రవికుమార్ వ్రాసిన పాటని సాహితీ చాగంటి, స్వరాగ్ కీర్తన కలిసి హుషారుగా పాడారు. 

కమల్ తేజ నర్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశి, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాల కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాత్విక్ రాజు, అంజలి ప్రియా, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కమల్ తేజ నర్ల, కెమెరా: కార్తీక్ సుజాత సాయికుమార్, ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు ఆర్ట్: భిక్షపతి కందకట్ల చేశారు. 

వడ్డే క్రియేషన్స్ సొంత బ్యానర్‌పై వడ్డే నవీన్ స్వయంగా నిర్మించి నటించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష