ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ...

July 26, 2026


img

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

తొలి ప్రేమ విఫలమైన తర్వాత మరో ప్రేమ అనే సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే మొదటి రెండు రోజులలోనే రూ. 25.2 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. 

సోనీ లివ్ భారీ ధరకు ‘చెన్నై లవ్ స్టోరీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ అనంతరం అంటే ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 

రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిగుణ్, దేవీ ప్రసాద్, సిరి హన్మంతు, పి. వాసు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 


Related Post

సినిమా స‌మీక్ష