ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్

July 25, 2026


img

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47, ఏకే 47’ షూటింగ్‌ ముగింపుకు వస్తున్న ఈ సమయంలో నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నట్లు పోస్టర్‌తో చెప్పేశారు. 

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు దర్శకత్వం & స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష