ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, తండ్రీకొడుకులుగా నటిస్తున్న ‘పళ్ళ బురుసు’ నుంచి ‘కొత్త సోకు’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది.
సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటకి పవన్ సిహెచ్ సంగీతం అందించగా, కుమార వాగ్దేవి, లక్ష్మి మేఘన, మాడం కలిసి హుషారుగా పాడారు.
తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తీసిన ఈ సినిమాలో తండ్రీకొడుకుల మద్య పళ్ళు తోముకునే బ్రష్ విషయంలో జరిగిన చిన్న గొడవ కోర్టు వరకు వెళ్ళడమే అసలు కథ. ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి సిద్ధం చేసిన ఈ ‘పళ్ళ బురుసు’ని ఆగస్ట్ 14న ప్రేక్షకులకు అందించబోతున్నారు.