ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రూపొందిస్తున్న రామాయణ మొదటి భాగం ట్రైలర్ నేడు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
తమ సినిమాలో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్మెంట్స్ కూడా వచ్చి చేరడంతో అంతర్జాతీయ స్థాయిలో రామాయణ విడుదల చేసే అవకాశం లభించిందని, కనుక గ్లోబల్ రిలీజ్‌కి తగిన సమయం చూసుకొని ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా, కన్నడ నటుడు యష్ రావణుడుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం: నితీష్ తివారీ, సంగీతం: ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్, వీఎఫ్ఎక్స్: డిఎన్ఈజీ (8సార్లు ఆస్కార్ అవార్డ్ గ్రహీత).
ఈ ఏడాది దీపావళికి రామాయణ మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కాబోతున్నాయి.

Ramayana’s journey from Bharat to the World has begun. 🏹

Reposted from @malhotra_namit

🕉️ pic.twitter.com/zw0NAYtwZR
— The World Of Ramayana (@WorldOfRamayana) July 24, 2026