సినిమాలలో ఒక పాటేస్తే హీరోలు ఐఏఎస్, ఐపీఎస్, న్యాయవాదులు, డాక్టర్లు చివరికి ముఖ్యమంత్రులు కూడా అయిపోగలరు. కానీ నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి విషయంలో ఇది రివర్స్ అయ్యింది.
ఆయన టీవీకే పార్టీతో రాజకీయాలలో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఆయన చివరిగా చేసిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) నేడు విడుదలై తీవ్ర నిరాశ పరిచింది.
ముఖ్యంగా అనిల్ రావిపూడి-బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ కాన్సెప్ట్, సినిమాలో పలు సన్నివేశాలు కాపీ కొట్టినట్లు ఉండటం, దర్శకుడు వినోద్ అనేక అంశాలను సినిమాలో బలవంతంగా జొప్పించడం వంటివి తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.
ఇలా జరుగుతుందని ముందు నుంచి అనుకుంటున్నదే. కనీసం తమిళనాడులోనైనా జన నాయగన్ నిలబడతాడో లేదో చూడాలి.
రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన జోసఫ్ విజయ్ హిట్ కొడితే, దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న అయన చివరి సినిమా ఫ్లాప్ అయితే విచిత్రంగానే ఉంటుంది కదా?