మాస్ మహారాజా రవితేజ మేనల్లుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ.’ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ మారెమ్మ పోస్టర్ విడుదల చేశారు.
మంచాల నాగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాధవ్‌కి జోడీగా దీపా బాలు నటిస్తోంది.
ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటింగ్: సాయిబాబు తలారి, ఆర్ట్: రాజ్‌కుమార్ మురుగేశన్, యాక్షన్: నటరాజ్ మడిగొండ చేస్తున్నారు. .
మోక్ష ఆర్ట్స్, ఆర్ట్‌బెస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మయూర్ రెడ్డి బండారు, కిచా వెంకట్ కలిసి నిర్మిస్తున్నారు.