టాక్సిక్‌: మనసాగదే సాంగ్‌ రొటీన్.. బట్ స్పైసీ

July 21, 2026


img

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా ‘టాక్సిక్‌’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్) నుంచి మనసాగదే అనే పాట (వీడియో సాంగ్‌) నేడు విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటని తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ,  ఫహీమ్ అబ్దుల్లా  కలిసి స్వరపరిచి సంగీతం అందించారు. సిద్ధార్థ్ బస్రూర్ పాడిన ఈ పాట, సంగీతంలో కొత్తదనమేమీ లేదు. చాలా రొటీన్‌ అనిపిస్తుంది. కానీ యష్‌ ఒక్కో హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం పాట కంటే హైలైట్‌గా కనిపిస్తోంది.      

 ‘టాక్సిక్‌’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ ఐదుగురు హీరోయిన్లు చేస్తున్నారు. ఓన్లీ ఫర్ గ్రోన్ అప్‌డేట్‌ అడల్ట్స్ అంటూ వేడెక్కిస్తున్న ‘టాక్సిక్’ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  . 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్‌), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.          


Related Post

సినిమా స‌మీక్ష