ఉన్న పార్టీలు సక్రమంగా పనిచేస్తే మా అవసరమే ఉండేది కాదు: కవిత

July 21, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలను ఉద్దేశ్యించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు సక్రమంగా పనిచేస్తుంటే కొత్త పార్టీల అవసరం ఉండేదే కాదు. కానీ అవి సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే కొత్త పార్టీలు వస్తున్నాయి.

మూడు పార్టీలు నిత్యం ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకోవడంతోనే సరిపోతుంది. ప్రజా సమస్యలు పట్టవు. కనుక ప్రజల తరపున పోరాడేందుకుకు టీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భవించింది,” అని అన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మళ్ళీ బీఆర్ఎస్‌ హయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, “ఆ పార్టీలో నేనున్నప్పుడు ఎప్పటికప్పుడు అవినీతి, అక్రమాలను కేసీఆర్‌గారి దృష్టికి తీసుకు వెళ్ళేదానిని. వాటిలో కొన్నిటిని పరిష్కరించేవారు. కొన్నిటిని పట్టించుకునేవారు కారు.

అవినీతి, అక్రమాల గురించి నేను ఆయనకి చెపుతున్నందునే పార్టీలో గుంటనక్కలు నన్ను బయటకు పంపించేశాయి. అప్పుడే నేను బాగా ఆలోచించాను. నాకు, నా కుటుంబానికి, నా రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే మౌనంగా ఉండిపోవడం సరికాదని టీఆర్ఎస్‌ పార్టీతో ప్రజల ముందుకు వచ్చాను,” అని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆ మూడు పార్టీలు సక్రమంగా పనిచేయడం లేదని కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. రేపు మరో కొత్త పార్టీ వచ్చి ఆమెపై కూడా ఇలాంటి విమర్శలే చేస్తే ఏం సమాధానం చెప్తారో?


Related Post