రంభ, ఊర్వశి, మేనకలతో నరేష్.. నా కంటి మీద కునుకే లిరికల్

July 22, 2026


img

అల్లరి నరేష్ తాజా చిత్రం ‘రంభ, ఊర్వశి, మేనక.’ వారితో నరేష్ ఏం సరసాలు ఆడుతున్నారో సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలీదు. ఈలోగా ఈ సినిమా నుంచి ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే ఓ లిరికల్ వీడియో సాంగ్‌ నేడు విడుదల చేశారు.

భాస్కరభట్ల రవికుమార్ వ్రాసిన ఈ పాటని చైతన్ భరద్వాజ్ స్వరపరిచి సంగీతం అందించగా ధనుంజయ్ సీపాన పాడారు. జీతు మాస్టర్ దీనికి నృత్య దర్శకత్వం చేశారు. 

చంద్రమోహన్ దర్శకత్వంలో సిద్దమవుతున్న ఈ సినిమాలో డా.కామాక్షి భాస్కర్, సాయి కుమార్‌, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్‌, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేస్తున్నారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మిస్తున్నఈ సినిమా సెప్టెంబర్‌ 4న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష