గబ్బర్ సింగ్ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్

July 22, 2026


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనని హైదరాబాద్‌, అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 

వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కానీ అయన ఆరోగ్యం నిలకడగా లేదని ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.   

గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా రమేష్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో చేశారు. ఇవి కాక మరికొన్ని తెలుగు సినిమాలలో ఆయన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 

రెండు రోజుల క్రితమే షూటింగ్‌ లొకేషన్ నుంచి ఓ వీడియోని అభిమానులతో షేర్ చేశారు కూడా. కానీ ఇంతలోనే ఆయన ఇలాంటి ఆరోగ్య సమస్యతో ఆస్పత్రి పాలవడంతో బంధుమిత్రులు, సినీ పరిశ్రమలో సన్నిహితులు షాక్ అయ్యారు. రమేష్ త్వరగా కోలుకుని మళ్ళీ సినిమాలు చేయాలని సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష