ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ... ఒకే వరుడు!

July 24, 2026
img

ఉత్తరప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని ధౌరియా గ్రామంలో ఈ విచిత్ర పరిణామం జరిగింది. 

ఆల్క, దేవిక, సంతోష్ ముగ్గురూ అక్కాచెల్లెళ్ళు. వారు ముగ్గురూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ముగ్గురూ పెళ్ళిళ్ళు చేసుకొని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతే కలిసి ఇక ఎన్నటికీ రీల్స్ చేయలేమని, కనుక తమ వీడియోలు షూట్ చేసే కెమెరా మ్యాన్ వికాస్‌ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించారు. కొన్ని వీడియోలలో అతను వారికి భర్తగా కూడా నటించాడు. కనుక అతను కూడా  వారి ప్రతిపాదనకు అంగీకరించాడు. 

కానీ ఇరు కుటుంబాలు, గ్రామస్తులు షాక్ అయ్యారు. అభ్యంతరం చెప్పారు. ఇలా అయితే అందరూ కలిసి తమని వేరు చేస్తారని భావించి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, వికాస్ స్థానిక గుళ్ళో పెళ్ళి చేసేసుకుని వచ్చి ఆశీర్వదించమని తల్లితండ్రులను కోరారు. వారు తమ పెళ్ళి ఫోటో, వీడియోని కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. 

Related Post