అప్పుడే మొదటి షెడ్యూల్ ఫినిష్.. వాహ్వా అనిల్ రావిపూడి!

July 24, 2026


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం  షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది.

రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకేక్కిస్తున్నప్పటికీ ఇది నూటికి నూరు శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అనిల్ రావిపూడి మొదటే చెప్పేశారు. కానీ ఇద్దరూ మాస్ హీరోలున్నప్పుడు వినోదంతో పాటు కాస్త యాక్షన్‌ కూడా అవసరమే. కనుక అన్నీ సమపాళ్ళలో ఉంటాయని తెలిపారు. 

మొదటి షెడ్యూల్‌లో వెంకటేష్, కల్యాణ్‌రామ్‌లపై కీలకమైన కుటుంబ సన్నివేశాలతో పాటు చిన్న మాంటేజ్ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.  

ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్, కల్యాణ్‌రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. 

జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. 

అనిల్ రావిపూడి–వెంకటేష్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి విజయాలు ఉండటం, ఈసారి వారితో కల్యాణ్‌రామ్ కూడా చేరడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతి 2027 లక్ష్యంగా పెట్టుకుని చకచకా షూటింగ్‌ పూర్తిచేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష