నేను రెడీ: ఫస్ట్ సింగిల్ వెరీ హాట్!

July 25, 2026


img

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో హనీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన ‘నేను రెడీ.’ నుంచి ‘కొంచెం కొంచెం’ అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. దీనిలో పాట, సాహిత్యం, సంగీతంపై దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది నర్గీస్ ఫక్రీ హాట్ హాట్‌గా చేసిన డాన్స్.    

ఈ పాటని రామ జోగయ్య శాస్త్రి వ్రాయగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ పాటని సమీరా భరద్వాజ్ ఆలపించగా, శేఖర్ వి.జే కొరియోగ్రఫీ చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: త్రినాథ్ రావు నక్కిన; కథ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్; సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: నిజార్ షఫీ; కోరియోగ్రఫీ: శేఖర్ వీజే; ఆర్ట్: రఘు కులకర్ణి; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేశారు. 

హార్నిక్ ఇండియా ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష