తెలుగు సినీ పరిశ్రమలో రొటీన్ సినిమాలు చేసే నటీనటులే ఎక్కువ మంది కనిపిస్తారు. కానీ ప్రతీ సినిమాకి భిన్నమైన కథతో వచ్చేవారు కొందరే ఉన్నారు. వారిలో నారా రోహిత్ కూడా ఒకరు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేయబోతున్న కొత్త సినిమా ‘కపాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం విడుదల చేశారు.
కపాలీతో ఓ అంతుపట్టని తాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ వేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో హాన్సిక కనిపించబోతున్నారు.
రామ్ గన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ సినిమాని విజయ్ కృష్ణ లింగమనేని సమర్పణలో సప్త అశ్వ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప కలిసి నిర్మిస్తున్నారు.
A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1
— Rohith Nara (@IamRohithNara) July 24, 2026