జంతర్ మంతర్ వద్ద విద్యార్ధుల సంబురాలు

July 25, 2026


img

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం రాజీనామా చేయడంతో, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులు తమ పోరాటం ఫలించింది.. విజయం సాధించామంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. 

నీట్ పరీక్ష రద్దు అయినందున ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కో విద్యార్ధి కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ఈ ఆందోళనలలో పాల్గొన్నవారిపై నమోదు చేసిన కేసులు రద్దు చేసేందుకు అంగీకరించింది. 

ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీ చార్జీ చేసి చాలా దురుసుగా వ్యవహరించిన పోలీసుల తరపున ఉన్నతాధికారి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ కూడా ఉంది. దానిపై కూడా సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

ఈ ఒక్క విషయంలో సీజేపీ ప్రతినిధులు పట్టుబట్టకుండా ఉండటం మంచిదని, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడటం పోలీసులు విధి కనుక ఆ ప్రయత్నంలో వారు లాఠీఛార్జి  చేశారని, అందుకు వారి చేత బహిరంగంగా క్షమాపణలు చెప్పించడం వారిని కించపరిచినట్లే అవుతుందని కేంద్ర మంత్రులు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా మన డిమాండ్లు అన్నీ సాధించుకున్నాము కనుక ఆందోళనలు విరమిద్దామని సీజేపీ సభ్యుడు అశుతోష్ అన్నారు. మరికొద్ది సేపట్లో వారు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

విద్యార్ధులు ఆందోళన విరమించి ఇళ్ళకు బయలుదేరేందుకు వీలుగా ఢిల్లీలోని రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటరియేట్ మెట్రో స్టేషన్లను తెరిచినట్లు ఢిల్లీ మెట్రో కార్పోరేషన్ ప్రకటించింది. 


Related Post