వెంకీ అట్లూరి దర్శకత్వం ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి రెండవ లిరికల్ వీడియో సాంగ్ శనివారం విడుదలైంది. వెడ్డింగ్ సాంగ్ పేరుతో వచ్చిన ఈ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా, జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
సూరియ స్వయంగా పాడి ఆడారు. ప్రముఖ నటి, ఆయన సతీమణి జ్యోతిక కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారని వెంకీ అట్లూరి బయటపెట్టారు. వారిరువురికీ చాలా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కనుక వారిరువురూ కలిసి చేసిన ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వయసులో తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోని వెంటపడి ప్రేమింఛి పెళ్ళి చేసుకోవాలనే ఓ అందమైన హీరోయిన్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో రవీనా టండన్, రాధికా శరత్‌కుమార్, నాజర్, సుధ, రఘుబాబు, సునీల్ రెడ్డి, భవానీ శ్రీ, వివా హర్ష, కాళీ వెంకట్, జార్జ్ మరియన్, హైపర్ ఆది, సృజా రవి, సర్వదమన్ బెనర్జీ, మాథ్యూ వర్గీస్, కల్యాణి నటరాజన్, కరాటే కార్తీక్, మాస్టర్ చార్విక్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: నిమిష రవి, ఎడిటింగ్: నవీన్ నూలి, కోరియోగ్రఫీ: శేఖర్ విజే, విజయ్ బిన్నీ, స్టంట్స్: వి వెంకట్ చేస్తున్నారు.
శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.