మా సుదీర్గ ప్రయాణం ఇప్పుడే మొదలైంది: అభిజీట్ దీప్కే

July 26, 2026


img

శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీట్ దీప్కే జంతర్ మంతర్ వద్ద గల వేలాదిమంది విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యం ఉదయించింది. మన పోరాటాలు ఫలించాయి. మొదటి వికెట్ పడింది. అయితే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే,” అని చెప్పారు. 

వారి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో నిన్న సాయంత్రంకల్లా విద్యార్ధులు జంతర్ మంతర్ ఖాళీ చేసి మళ్ళీ 37 రోజుల తర్వాత ఇళ్ళకు చేరుకున్నారు.     

వారిలో అభిజీట్ దీప్కే కూడా ఒకరు. ఈరోజు ఉదయం తన ఇంట్లో నిద్ర మేల్కొన్నాక సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ పోరాటంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే సీజేపీ.. దాని ఆందోళనలపై నిర్మాణాత్మక విమర్శలు చేసిన తమ లోపాలు సరిదిద్దుకునేందుకు తోడ్పడిన వారికి కూడా అయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని అభిజీట్ దీప్కే స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని తాము సుదీర్గ ప్రయాణానికి సిద్దం అవుతున్నామని అభిజీట్ దీప్కే స్పష్టం చేశారు. 

బిజేపి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీజేపీ పోరాటాలు చేయబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. సీజేపీ ఆందోళనలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలతో కలిసి పనిచేయబోతోందా?లేక ఆమాద్మీ పార్టీలా స్వతంత్రంగా పనిచేయబోతోందా?అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.           


Related Post