న్యూటన్స్ థర్డ్ లా.. జూలై 31న థియేటర్లలోకి

July 26, 2026


img

జగపతిబాబు, సుమంత్ యార్లగడ్డ, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్ విడుదలైంది. 

రాజేష్ కర్ణ కథ, దర్శకత్వంలో క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ స్పష్టం చేసింది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ‘ప్రతీ క్రియకు ప్రతిక్రియ ఉంటుంది’ గనుక బలమైన కారణంతో హత్యలు జరిగినప్పుడు, వాటికి పోలీసుల ప్రతిక్రియ కూడా అంతే బలంగా ఉంటుందని చెప్పబోతున్నట్లనిపిస్తుంది ట్రైలర్‌ చూస్తే!   

ఈ సినిమాలో రవివర్మ, షెల్లీ ఎన్ కుమార్, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, పండిట్ గౌతమ్, హారిణి రావు గగనం, రూపేష్ మర్రపు, అభినయనా తదితరులు నటించారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: రాజేష్ కర్ణ; కెమెరా: వేద వ్యాస్ గొట్టిపాటి; సంగీతం: సింజిత్ యెర్రమిల్లి; ఎడిటింగ్: అనిల్ పసల; యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి చేశారు.

ఈటీవీ విన్ బ్యానర్‌పై హరీష్ కోహిర్కర్ నిర్మించిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష