బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అదివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనని హనుమకొండలోని రోహిణీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ వైద్యులు ఆయనకి అత్యవసర చికిత్స చేసి ప్రాణం కాపాడారు. కానీ అయన పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పారు.
ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు రోహిణీ హాస్పిటల్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి అయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయనని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.