యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన ‘దీవానా’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ ద్వారా జూలై 31 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ముందుగా ఆహా ‘గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు’ ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30 నుంచే సినిమాను చూసే అవకాశం కల్పించారు.
చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అనిపించుకుంది దివానా. హీరో హీరోయిన్ల పరిచయం, అభిప్రాయాలు, గొడవలతో దూరమవుతారనుకుంటే ఘాడమైన ప్రేమలో పడతారు. అలాంటి పరిస్థితిలో వారి ప్రేమకు పరీక్ష ఎదురైతే ఏం జరిగిందనేది ఈ సినిమా. ముఖ్యంగా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కంకేట్ అవడంతో సూపర్ హిట్ అయ్యింది.
వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, ఝాన్సీ, బలగం వేణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ఓటీటీలోకి వచ్చేస్తోందని తెలియజేస్తూ, “మిస్ అయితే మస్త్ ఫీల్ అవుతవ్” అనే క్యాప్షన్ తగిలించడం ఓటీటీ ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది.