ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్, కుమార్తె మాలతీ మేరీతో కలిసి ఆదివారం హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాశి’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు.
ఈసారి భర్త, కుమార్తె కూడా ఆమె వెంట తీసుకురావడమే ఆశ్చర్యకరం. షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది కనుక తన కుటుంబాన్ని రాజమౌళి, మహేష్ బాబు, యూనిట్ సభ్యులకు పరిచయం చేసేందుకు తీసుకువచ్చి ఉండవచ్చు.
ఈ సినిమాలో మందాకినిగా ప్రియాంకా చొప్రా, విలన్ కుంభగా పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.