హనుమకొండలో పవన్ కళ్యాణ్‌కి సాదర స్వాగతం

June 17, 2026
img

ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ తన అభిమానిని పరామర్శించేందుకు నేడు హనుమకొండకు వచ్చారు. ఆయనకు స్థానిక ప్రజలు, అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌ వారికి అభివాదం చేస్తూ నిరంజన్ ఇంటికి చేరుకున్నారు.

పదిహేడేళ్ళు వయసున్న అతను అరుదైన జన్యుపరమైన డీఎండీ వ్యాధితో మంచానికే పరిమితమైయ్యాడు. అతను తనని చూడాలనుకుంటున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్‌ నేడు హనుమకొండలో అతని ఇంటికి వెళ్ళి నిరంజన్‌ను పరామర్శించి కొద్దిసేపు అతనితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి, వైద్యం గురించి తల్లితండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి నిరంజన్‌కు చికిత్స చేయించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. 

పవన్ కళ్యాణ్‌ వచ్చిన విషయం తెలుసుకొని భారీ సంఖ్యలో అయన అభిమానులు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా చాలా కోలాహలంగా మారింది.

రెండు వారాల క్రితం పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కానీ పవన్ కళ్యాణ్‌ నేడు హనుమకొండకు వచ్చినప్పుడు ప్రజలు సాదరంగా స్వాగతం చెప్పారు. తన పర్యటనకు సహకరించినందుకు సిఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ పోలీస్ శాఖకు పవన్ కళ్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Related Post