ఏసీబీ వలలో ఆర్‌&బి ఈఎన్‌సీ మోహన్ నాయక్‌

June 09, 2026
img

ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై నిఘాపెట్టి దాడులు చేస్తున్నారని తెలిసి ఉన్నా ఎవరూ ఏ మాత్రం భయపడుతున్నట్లు లేదు. రోడ్లు మరియు భవనాల శాఖలో ఈఎన్‌సీగా చేస్తున్న మోహన్ నాయక్‌ ఇంట్లో నేడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అయన నివాసంతో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి 15 చోట్ల సోదాలు నిర్వహించి ఒక కేజీ బంగారు నగలు, 13 బంగారు బిస్కట్లు, భారీగా వెండి వస్తువులు, ఖరీదైన 20 విదేశీ మద్యం బాటిల్స్  స్వాధీనం చేసుకున్నారు. 

మోహన్ నాయక్ పేరిట హైదరాబాద్‌, నిజామాబాద్‌లో ఇళ్ళకు సంబందించిన పత్రాలు. రూ.60 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్లోని అయన కార్యాలయంలో ఫైల్స్ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారు వంద కోట్లు ఉండవచ్చని ఏసీబీ అంచనా వేశారు. మంగళవారం సాయంత్రం 6గంటలకు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.      


Related Post