ఖమ్మం నగరంలో జరిగిన ఓ హత్యాచర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వాచ్ మ్యాన్ కుటుంబం నివాసం ఉంటోంది. అదే భవనంలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ నెల 6న ఆ వాచ్ మ్యాన్ కుమార్తె (12) పై అంతస్తుకి వచ్చినప్పుడు తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేయబోయాడు.
కానీ ఆ బాలిక అతనిని నుంచి తప్పించుకొని భయంతో కేకలు పెడుతూ కిందకు పారిపోబోయింది. ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని భయపడిన ఆ వ్యక్తి ఆ బాలికని పై నుంచి కిందకు తోసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు.
పై నుంచి పడటంతో ఆ బాలిక వెన్నెముక, పక్కటెముకలు ఫ్రాక్చర్ అయ్యాయి. అపార్ట్‌మెంట్‌వాసులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి ఆ బాలికను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.