సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం ‘సింగ్..గీతం’ ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఓరి జీవుడా.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. శ్రీమణి వ్రాసిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శంకర్ బాబు హుషారుగా పాడారు.
ఈ సినిమాలో అయాన్, ఆహిల్య, షాలిని ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు, కథ: గౌతమి చల్లగుళ్ళ, శశాంక్ చింతలపూడి, రత్న శ్రీకర్, నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అంకుర్ సి, పాటలు: శ్రీమణి చేశారు.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా ఈ సినిమా నిర్మించారు.