లెనిన్ ట్రైలర్‌... ఈసారి అఖిల్‌కి హిట్ పక్కా?

June 17, 2026


img

అక్కినేని వారసులలో అఖిల్ ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

తాజాగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడినందున ట్రైలర్‌ వదిలారు. ట్రైలర్‌లో అఖిల్ గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కనుక ‘లెనిన్’తో అఖిల్ ఖాతాలో తప్పకుండా హిట్ పడుతుందని భావించవచ్చు.     

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు, సంగీతం: తమన్, కెమెరా: లియాన్ బ్రిట్టో, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

మనం ఎంటర్‌ప్రైజస్, సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష