థియేటర్లలో చిన్నా పెద్ద సినిమాలు ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఓటీటీలో కూడా వివిధ భాషల్లో ఒకదానిని మించిన మరొక వెబ్ సిరీస్ అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందించిన దీనిలో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య, మేరిన్ ఫిలిప్ ప్రధానపాత్రలు చేశారు.
‘విశాఖపట్నం పోర్టుపై పెత్తనం’ క్రైమ్ స్టోరీతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ఇప్పుడు తొలిసారిగా ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ వస్తోంది. “వ్యాపారం చేయడానికి కావాల్సింది చేతులు కాదు.. గుండెల్లో దమ్ము... ఆ దమ్ము పేరే నాయుడు..” అంటూ చురకత్తుల వంటి డైలాగులు, యాక్షన్ సీన్స్ ట్రైలర్‌లో చాలానే ఉన్నాయి.
ఈ సినిమాకు కధ: ప్రశాంత్ రాగతి, దర్శకత్వం, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఆర్ట్: వంశీ పచ్చిపులుసు, స్క్రీన్ ప్లే:శశిధర్, కృష్ణ, గ్యారీ బిహెచ్ చేశారు.
టమాడా మీడియా బ్యానర్‌పై రాహుల్ తమాడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 2 నుంచి ఇసకపట్నం వెబ్ సిరీస్ 5 భాషల్లో ప్రసారం కాబోతోంది.