అనుమాన పక్షి టీజర్‌ కామెడీ బాగానే ఉంది గానీ...

June 09, 2026


img

రాగ్ మయూర్ హీరోగా వస్తున్న ‘అనుమాన పక్షి’ టీజర్‌ నేడు విడుదలైంది. సినిమా టైటిల్‌తోనే కధేంటో దర్శకుడు విమల్ కృష్ణ చెప్పేశారు కనుక ఈ చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా కూర్చో బెట్టగలారా? అనే అనుమానం కలుగుతోంది. 

ఈ సినిమాలో మేరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విమల్ కృష్ణ, కెమెరా:సునీల్ కుమార్‌ నామా, ఆర్ట్: జేకే మూర్తి, ఎడిటింగ్: చోట కే ప్రసాద్, కోరియోగ్రఫీ: ఈశ్వర్ చేశారు.

 చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవి చిలక, మెగా చిలక నిర్మించిన అనుమాన పక్షి రేపు (జూన్‌ 10)న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష